Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి రెజీనా కోసం ఎగబడ్డ యువకుడు... చూస్తుండగానే సజీవ దహనమయ్యాడు...

సినిమా హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఎంతగా ఉత్సాహం చూపుతారో చెప్పక్కర్లేదు. శనివారం నాడు గుంటూరులో ఇదే అభిమానం ఓ యువకుడి ప్రాణం తీసింది. అంతా చూస్తుండగానే అతడు సజీవ దహనమయ్యాడు. వివరాల్లోకి వెళితే... సినీ నటి రెజీనా శనివారం నాడు గుంటూరు నగరంలో నీరూస

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (21:06 IST)
సినిమా హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఎంతగా ఉత్సాహం చూపుతారో చెప్పక్కర్లేదు. శనివారం నాడు గుంటూరులో ఇదే అభిమానం ఓ యువకుడి ప్రాణం తీసింది. అంతా చూస్తుండగానే అతడు సజీవ దహనమయ్యాడు. వివరాల్లోకి వెళితే... సినీ నటి రెజీనా శనివారం నాడు గుంటూరు నగరంలో నీరూస్ షోరూం ప్రారంభానికి వస్తుందని తెలిసి అక్కడికి పెద్దఎత్తున యువకులు చేరుకున్నారు.
 
ఆ షోరూం ప్రక్కనే పెద్ద ఫ్లెక్సీని కూడా పెట్టారు. యువకులంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో కొద్దిపాటి తోపులాట మొదలైంది. ఈ క్రమంలో విజయ్ అనే యువకుడు షోరూం ప్రక్కనే వున్న ఫ్లెక్సీని పట్టుకున్నాడు. ఆ ఫ్లెక్సీ ప్రక్కనే వున్న ట్రాన్సఫార్మర్‌కు తగులుకోవడంతో విజయ్‌కు షాక్ కొట్టింది. దాంతో అతడు కిందపడిపోయాడు. 
 
ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు చెలరేగి ఫ్లెక్సీకి అంటుకుని అది అతడిపై పడి మంటలు వ్యాపించాయి. అంతా చూస్తుండగానే అతడు సజీవ దహనమయ్యాడు. అతడిని మంటల నుంచి కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ప్రయత్నంలో మరో యువకుడు కూడా గాయాలపాలయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments