Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఎన్నికల్లో తెదేపా-145 వైసీపికి 35 స్థానాలే... అంత ధీమా ఎందుకో...

అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకున్నట్లు కనబడుతోంది. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర చేపట్టేందుకు కొండగట్టును పాయింట్ గా చేసుకుని మొదలుపెట్టారు. ఇక ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ పా

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (17:12 IST)
అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకున్నట్లు కనబడుతోంది. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర చేపట్టేందుకు కొండగట్టును పాయింట్ గా చేసుకుని మొదలుపెట్టారు. ఇక ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎంత బలం వుందన్న దానిపై అప్పుడే రకరకాల సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ అయితే 2019 ఎన్నికల్లో వైసీపీకి 13 ఎంపీ స్థానాలు వస్తాయని, టీడీపి కూటమికి 12 ఎంపీ స్థానాలు ఖాయమని తేల్చింది. 
 
ఐతే ఇదంతా వట్టి ట్రాష్ అంటున్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న స్థానాలని మించి కైవసం చేసుకుంటుందనీ, ఏకంగా 135 నుంచి 145 స్థానాలను రాబట్టుకుంటుందని వెల్లడించారు. తెదేపా విజయం సాధించబోయే స్థానాల్లో వైసీపి నుంచి అభ్యర్థులు కూడా పోటీ చేసే పరిస్థితి లేదని వెల్లడించారు. మహా వైసీపీ 30 నుంచి 35 స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందేమోనని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో తన బలం ఎంతో తెలుసుకునేందుకు 2019 ఎన్నికలు వేదిక అవుతాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments