టీడీపీ సీనియర్‌ నేత జనార్ధన్‌ థాట్రాజ్‌ మృతి

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:55 IST)
టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌ థాట్రాజ్‌ (65) మృతి చెందారు. గుండెపోటుకు గురైన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించారు.

రవాణాశాఖ మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజుకు మేనల్లుడు అయిన ఆయన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. జనార్ధన్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ను వీడి మేనమామ శత్రుచర్లతో కలిసి టీడీపీలో చేరారు.

2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసినప్పటికీ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన అభ్యంతరాలు రావడంతో నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఆయన తల్లిని టీడీపీ నుంచి పోటీ చేయించారు.

అప్పటి నుంచి జనార్ధన్‌ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో విజయనగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల గుండెపోటుకు గురవ్వడంతో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్ తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments