Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంట్రోల్... కంట్రోల్... కార్య‌క‌ర్త‌ల‌ను వారిస్తున్న నారా లోకేష్!

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (17:59 IST)
తెలుగుదేశం అధినేత కంట నీరు పెట్టే స‌రికి, తెలుగు త‌మ్ముళ్ళు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంత‌గా బాధ‌పెడ‌తారా? అవ‌మానిస్తారా అంటూ ఊగిపోతున్నార‌ట. పార్టీ పెద్ద చంద్రబాబు కన్నీటి పర్యంతం కావడంతో తెలుగు తమ్ముళ్ల ఆక్రోశం చెందుతున్నారు. చూస్తూ, ఎలా ఊరుకుంటాం అని ఉద్రేక పడుతున్న తెలుగుదేశం కార్యకర్తల‌ను యువ నేత నారా లోకేష్ వారిస్తున్నార‌ట‌. కంట్రోల్ ....కంట్రోల్ అంటూ, సంయమనం పాటించాలని నారా లోకేష్ తెలుగు యువ‌త‌కు హిత‌బోధ చేశార‌ట‌.

 
ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందామన్న తెలుగుదేశం అధినేత మాటను నిలబెట్టాల‌ని నారా  లోకేష్ కార్య‌క‌ర్త‌ల‌కు సూచిస్తున్నారు. ఎవరూ సంయమనం కోల్పోవద్దు, వచ్చే ఎన్నికల్లో గెలిచి మన నాయ‌కుడికి బహుమతిగా ఇవ్వాలి అని తెలుగుదేశం కార్యకర్తలకు నారా  లోకేష్ హితభోద చేశారు. అసెంబ్లీలో జ‌రిగిన సీన్, త‌ర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ‌వ‌టంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా ఉలిక్కిప‌డింది.


దీనిపై తెలుగుదేశం నేత‌లు ఆవేశంగా మీడియాలో మాట్లాడుతున్నారు. డిబేట్ ల‌లో పాల్గొంటున్నారు. మ‌హిళా నేత‌లైతే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని, ముగ్గురు మంత్రులు, ఒక ఎమ్మెల్యేని తిట్టిపోస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నారా లోకేష్ మాత్రం ఇంత వ‌ర‌కు మీడియా ముందుకు రాలేదు. కానీ, తెలుగుదేశం కార్య‌కర్త‌ల‌ను మాత్రం ఆయ‌న సంయ‌మ‌నం పాటించాల‌ని సూచ‌న‌లు చేస్తున్నారు. 


మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసిన కార్యకర్తలు మనస్థాపం చెంది పురుగుల మందు తాగారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు స్ఫూర్తి సూర్య నే : ఎస్ఎస్ రాజమౌళి - అవకాశం మిస్ చేసుకున్నా: సూర్య

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments