Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన కర్మాగారాల్లో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారం ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాబోదని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు స్పష్టంచేశారు. అయితే, వైకాపా వంటి కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉద్దేశపూర్వకంగానే ఈ అంశంపై రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, "విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారు కదా. పాదయాత్ర సమయంలో తాను కూడా అదే చెప్పాను. గత ఐదేళ్లలో విశాఖ ఉక్కుకు ఏ కొంచెమైనా సాయం జరిగిందా? ప్రైవేటీకరణ యోచనే లేదు. వైకాపా మాత్రం ప్రతిరోజూ ఎక్స్‌లో పోస్ట్‌ పెడుతుంది. ఇంకా వాళ్లకు బుద్ధిరాలేదు" అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. 
 
తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు వైకాపా నేతలకు మరో అంశం లేదన్నారు. అందుకే ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన అతి సున్నితమైన విశాఖ ఉక్కు అంశంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పినా వైకాపా నేతలకు ఇంకా బుద్ధిమారలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని గాయాలను సమయం నయం చేస్తుందంటారు.. కానీ అది నిజం కాదు.. భావన

పుష్ప-2 సెట్లో అల్లు అర్జున్ కు శస్త్ర చికిత్స చేస్తున్న ఒరిజినల్ డాక్టర్ !

దేవర ప్రభంజనం.. అడ్వాన్స్ బుక్సింగ్స్‌తో షేక్ షేక్.. అమెరికాలో కొత్త రికార్డ్

ప్రేమ.. పెళ్లి.. పేరుతో రూ.2కోట్లు గుంజేశాడు.. యూట్యూబర్ హర్షపై కేసు

జానీ మాస్టర్ కి జరిగింది రేపు వారికీ జరుగుద్ది : సుహాసిని కామెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

మొక్కజొన్న పొత్తులు తింటే ప్రయోజనాలు ఏమిటంటే?

తర్వాతి కథనం
Show comments