Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీపై 6 విమానయాన సంస్థలు నిషేధం... జెంబో జెట్లో జేసీ హ్యాపీగా యూరప్‌కు...

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖపట్టణంలో ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగులు తనను అనుమతించలేదంటూ హంగామా చేసిన నేపధ్యంలో ఆయనపై 6 డొమెస్టిక్ విమానయాన సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐతే జేసీ ద

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (16:20 IST)
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖపట్టణంలో ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగులు తనను అనుమతించలేదంటూ హంగామా చేసిన నేపధ్యంలో ఆయనపై 6 డొమెస్టిక్ విమానయాన సంస్థలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐతే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం తను దురుసుగా ఏమీ ప్రవర్తించలేదనీ, తను ముందుగా వచ్చినా సిబ్బంది హంగామా చేశారంటూ చెప్పారు. 
 
డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ నిషేధం అలా సాగుతుండగానే జేసీ దివాకర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి హ్యాపీగా విమానంలోనే యూరప్ ప్రయాణమై వెళ్లిపోయారు. దీనిపై ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... మా సోదరుడు విదేశీ యానంపై ఎందుకంత ఉత్సాహం... ఆయన ఇప్పుడు ప్లాన్ చేసుకోలేదు. 
 
ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు. వెళ్లారు. నేను కూడా వెళ్లాల్సింది కానీ కుదర్లేదు అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు జేసీ క్షమాపణలు చెబితే నిషేధాన్ని ఎత్తివేసేందుకు విమానయాన సంస్థలు వున్నట్లు తెలుస్తోంది. కానీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం తను తప్పేమీ చేయలేదంటూ వాదిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments