Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా శవం కూడా చంద్రబాబుతోనే ఉంటుంది : బుద్ధా వెంకన్నా

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:54 IST)
తాను పార్టీ మారబోతున్నట్టు సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా క్లారిటీ ఇచ్చారు. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు తాను టీడీపీ అధినేత చంద్రబాబుతోనే ఉంటానని పునరుద్ఘాటించారు. వైకాపాకు చెందిన అల్లరి మూక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దుష్ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. 
 
తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై బుద్ధా వెంకన్నా స్పందిస్తూ, తనకు పార్టీ మారాలాన్న ఆలోచన ఏదీ లేదన్నారు. కొందరు కావాలనే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బతికివున్నంత వరకు టీడీపీతోనే ఉంటానని, చంద్రబాబుతోనే కలిసి పని చేస్తానని చెప్పి, తన గురించి సాగుతున్న పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. 
 
కాగా, ఇటీవల విజయాడలోని ఎన్.ఏ.సి. కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్ధా వెంకన్న ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు నొచ్చుకున్నారు. పైగా వేదికపైకి వెళ్లొద్దంటూ వారు వారించారు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. అంతే, ఆయన టీడీపీని వీడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments