బర్రెలు, గొర్రెలు, బ‌తుక‌మ్మ చీర‌లు అంటూ.. మాయమాటలు చెప్తున్నారు: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం విలాస‌వంత‌మైన జీవితాన్ని అనుభ‌విస్తోందని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాక ముందు కేసీఆర్ చెప్పిందేమిటి? ఇప్పుడు చేస

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (08:00 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం విలాస‌వంత‌మైన జీవితాన్ని అనుభ‌విస్తోందని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాక ముందు కేసీఆర్ చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. బర్రెలు, గొర్రెలు, బ‌తుక‌మ్మ చీర‌లు అంటూ మాయ‌మాట‌లు చెబుతున్నార‌ని అన్నారు. బ‌తుక‌మ్మ చీర‌ల కోస‌మా తెలంగాణ‌కు సాధించుకుంది అంటూ విమ‌ర్శించారు. గొర్రెలు, బర్రెలు కోసమా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
 
రేవంత్‌ రెడ్డి రాజీనామాపై నల్గొండలో తెలుగుతమ్ముళ్లు ఫైరయ్యారు. రేవంత్‌తో పాటు జిల్లాలో మరికొంత మంది నేతలు కాంగ్రెస్‌ బాట పడుతున్నారని వార్తలు రావడంతో ఆగ్రహించిన తమ్ముళ్లు ఫెక్ల్సీలను చింపేశారు. రేవంత్‌తో పాటు కంచర్ల భూపాల్ రెడ్డి, బిల్యానాయక్‌ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు మరో పార్టీలోకి మారాడాన్ని జీర్ణించుకోలేని కార్యకర్తలు వాటిని చింపేసి తగలబెట్టారు. అనంతరం వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లెక్సీలు దగ్ధం చేయడంపై రేవంత్‌ రెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments