జగన్‌కు ఆదినారాయణ బంపర్ ఆఫర్.. వైకాపాను టీడీపీలో విలీనం చేస్తే పోలా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వైకాపా నుంచి జంప్ అయి.. టీడీపీలో మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు జగన్ మద్దతు పలకడంపై ఆదినారాయణ ఎద్

Webdunia
ఆదివారం, 14 మే 2017 (17:39 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వైకాపా నుంచి జంప్ అయి.. టీడీపీలో మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు జగన్ మద్దతు పలకడంపై ఆదినారాయణ ఎద్దేవా చేశారు. జగన్ తన పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాలని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి గోడదూకిన సుజయ, ఆదినారాయణ, అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డిలు మంత్రులైన సంగతి తెలిసిందే.
 
ప్రస్తుతం వీరిలో ఒకరైన ఆదినారాయణ రెడ్డి జగన్‌పై సెటైర్లు విసిరారు. 2014 మే 16న కౌంటింగ్ తర్వాత ప్రధాన మోడీని, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను జగన్ కలవడాన్ని తాను అప్పుడే వ్యతిరేకించానన్నారు. ప్రత్యేక హోదా కోసం వచ్చే నెలలో తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారు.
 
కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో జగన్ రాజీపడ్డారని, ఆన ఓ కలుపుమొక్క అన్నారు. అలాంటి జగన్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments