Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పు తెచ్చిన తంటా...! జ‌గ‌న్ ప‌ర్య‌ట‌నను అడ్డుకుంటున్న‌టీడీపీ నేత‌లు

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (21:57 IST)
అనంత‌పురం: చ‌ంద్ర‌బాబును చెప్పుల‌తో కొట్టాల‌ని జ‌గ‌న్ అన్న మాట‌లు... ఏపీలో మంట‌లు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా అనంత‌పురంలో ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిపై ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ‌టమే కాకుండా... ఇపుడు అనంత‌లో టీడీపీ నేత‌లు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను టార్గెట్ చేశారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌ను అడ్డుకుంటున్నారు.
 
అనంతపురం జిల్లా క‌దిరిలో జ‌గ‌న్ యాత్ర‌ను ఎట్టి ప‌రిస్థితుల‌లో జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని స్థానిక నాయ‌కుడు వెంక‌ట ప్ర‌సాద్ మండిప‌డ్డారు. త‌మ నేత చంద్ర‌బాబు నాయుడుపై చెప్పులు వేయ‌మ‌న్న జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను పోలీసులు అడ్డుకొని అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని... లేకుంటే తాము జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అడ్డుకుంటామ‌ని రోడ్డుపై బైఠాయించారు. దీనితో అనంత‌లో ఉద్రిక్త‌ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రో ప‌క్క మంత్రి ప‌రిటాల సునీత కూడా సీరియ‌స్ అవుతున్నారు. జగన్‌కి పిచ్చిపట్టి సీఎంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడ‌ని, గతంలో వైఎస్ఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఎలాంటి గతి పట్టాడో గుర్తుకు చేసుకోమని హెచ్చరించారు. సీఎం చంద్ర‌బాబును కాదు... జగన్‌నే చెప్పుతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఘాటుగా విమర్శించారు ప‌రిటాల సునీత‌.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments