Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదో ఓ రోజున హోం మంత్రినవుతా.. అపుడు మీ అంతు చూస్తా : అచ్చెన్నాయుడు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (15:02 IST)
ఏదో ఒక రోజున తాను ఏపీకి హోం మంత్రిని అవుతానని అపుడు తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల అంతు చూస్తానని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 
 
తొలి దశ నామినేషన్ల సమయంలో తన స్వగ్రామం నిమ్మాడలో దౌర్జన్యం చేశారంటూ పోలీసులు అచ్చెన్నను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు.
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని... ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ విపక్ష నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 
 
రేపు అధికారం టీడీపీదేనని, తాను హోం మంత్రిని అవుతానని, తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తమ అధినేత చంద్రబాబును ఒప్పించి హోం మంత్రిని అవుతానని చెప్పారు. తనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, నోటీసులు ఇస్తే తానే స్టేషన్‌కు వచ్చేవాడినని చెప్పారు. 
 
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... వారంటేనే విరక్తి కలుగుతోందని తెలిపారు. డీఎస్పీ, సీఐ తన బెడ్రూమ్ లోకి వచ్చారని మండిపడ్డారు. నాయకులను తాను తప్పుపట్టడం లేదని, పోలీసుల తీరును మాత్రమే విమర్శిస్తున్నానని చెప్పారు. వైసీపీ కార్యకర్తల మాదిరి పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. తాను చట్టాన్ని, ధర్మాన్ని ఆచరించే వ్యక్తినని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments