Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ అబద్దాలు చెపుతున్నారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న పూసపాటి

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంపై కేంద్ర పౌరవిమానయానమంత్రి పూసపాటి అశోకగజప

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (14:38 IST)
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంపై కేంద్ర పౌరవిమానయానమంత్రి పూసపాటి అశోకగజపతిరాజు సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డి అబద్ధాలు చెపుతున్నారంటూ మండిపడ్డారు. 
 
ముఖ్యంగా వైజాగ్ ఎయిర్ పోర్టుకు గంట ముందే వచ్చానని దివాకర్ రెడ్డి చెప్పారని... కానీ, సీసీటీవీ ఫుటేజీలో అది అవాస్తవమని తేలిందని చెప్పారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. మరోవైపు, చిన్న చిన్న విషయాలు కూడా పార్టీ పరువును దిగజారుస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, జేసీ దివాకర్ రెడ్డిపై ఇండిగోతో పాటు.. ఏడు ఎయిర్ లైన్స్ సంస్థలు వేటు వేశాయి. దీంతో ఈ ఏడు విమానయాన సంస్థల్లో జేసీ ప్రయాణించేందుకు వీల్లేకుండా పోయింది. మరోవైపు... 'వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో అసలు ఏం జరిగిందన్న వివరాలను తెలుసుకోవాల్సి ఉంది. దీనిపై చట్ట ప్రకారం నడుచుకుంటాం' అని అశోక్ గజపతి రాజు చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments