Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ వంటి నగరం నిర్మించాలంటే 20 సంవత్సరాలు పడుతుంది!

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (15:42 IST)
హైదరాబాద్‌ వంటి నగరం నిర్మించాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్, పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలన్నీ, నేటి నరేంద్ర మోడీ సర్కారు నెరవేర్చాల్సిందేనని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మండలిలో తీర్మానం చేసిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. 
 
యూపీఏ ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించిందని చంద్రబాబు మరోసారి ఆరోపించారు. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదని తెలిపిన ఆయన, రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రాజెక్టుల కోసం ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో తాను సంప్రదింపులు జరిపానన్నారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని, కేంద్రం సహకరిస్తేనే తిరిగి వృద్ధి బాటలో కొనసాగే వీలుంటుందని తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments