Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు.. నిర్ణయం బాధ కలిగించింది : వర్ల రామయ్య

తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌తో పాటు టీడీపీ ల

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (15:26 IST)
తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌తో పాటు టీడీపీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ పేర్లను ఆయన ఖరారు చేశారు. 
 
నిజానికి ఆ పార్టీ సాంస్కృతిక విభాగం ఎస్సీ నేత వర్ల రామయ్య పేరును పరిశీలించారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో వర్ల రామయ్య పేరును తొలగించి ఆయన స్థానంలో రవీంద్ర కుమార్ పేరును చేర్చి, రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. 
 
దీనిపై వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు బాధ కలిగించినప్పటికీ, అధినేత చంద్రబాబు ఆదేశం శిరోధార్యంగా భావిస్తానని చెప్పారు. కొందరు నేతలు వ్యవహరించినట్లు తాను పదవుల కోసం పార్టీ మారే రకం కాదని, చంద్రబాబుకు అండగా ఉండాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments