Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్ నికోబార్ ఎన్నికలు: సత్తా చాటిన తెలుగుదేశం పార్టీ

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (16:31 IST)
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో జరిగిన నగర పాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. తద్వారా జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత టీడీపీ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 24 వార్డులకు జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 10 వార్డుల్లో అగ్రస్థానంలో నిలువగా.. కాంగ్రెస్ పార్టీకి ఆరు వార్డులు దక్కాయి. 
 
ఇక తెలుగుదేశం పార్టీకి రెండు వార్డులు సొంతం కాగా, అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు చెరో వార్డు చొప్పున గెలుచుకున్నాయి. ఇతర పార్టీలు నాలుగు స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఇక బీజేపీ 10 స్థానాల్లో గెలువగా, తెలుగుదేశం పార్టీకి ఇద్దరు సభ్యులు ఉండటంతో, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు సాయంతో నగర పాలక పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
 
అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగుదేశం పార్టీ రెండు వార్డుల్లో సత్తాచాటడం పట్ల ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ హోదాలో తెలుగుదేశానికి దక్కిన తొలి విజయం ఇదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో త్వరలోనే మరిన్ని ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరిస్తుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments