ఎన్డీయేతో కటీఫ్ : అవిశ్వాసం పెట్టాల్సిందిగా చంద్రబాబు ఆదేశం

ఎన్డీయే కూటమితో అధికార తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంది. పైగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందిగా ఆ పార్టీ ఎంపీ తోట నర్సింహంకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (09:11 IST)
ఎన్డీయే కూటమితో అధికార తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకుంది. పైగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందిగా ఆ పార్టీ ఎంపీ తోట నర్సింహంకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 
 
నిజానికి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్టీయేపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎట్టకేలకు గుడ్‌బై చెప్పాలని శుక్రవారం నిర్ణయించుకుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలతో రాజీనామా చేయించిన టీడీపీ అధిష్టానం చివరకు ఎన్డీయేలో కొనసాగరాదని నిర్ణయం తీసుకుంది. పొలిట్‌బ్యూరో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. అందరి అభిప్రాయాలను తెలుసుకుని.. ఎన్డీయేకు కటీఫ్ చెప్పాలని నిర్ణయించారు. ఇదిలావుండగా... ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తెగతెంపుల విషయం చెప్పారని, అంతేగాక అవిశ్వాసం కూడా టీడీపీనే పెట్టాలని ఎంపీలను ఆదేశించారు.
 
కాగా, ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై జగన్ సారథ్యంలోని వైకాపా అవిశ్వాస తీర్మాన నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు గురువారమే అందజేసిన విషయం తెల్సిందే. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తొలుత ఆదేశించిన చంద్రబాబు... ఇపుడు ఏకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆదేశించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments