Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తే.. ఎగిరి బైకుపై పడ్డాడు.. ఆపై?

హైదరాబాదులో వాహనాల రద్దీ కారణంగా రోడ్డు దాటాలంటేనే పాదచారులు హడలిపోతున్నారు. మెరుపు వేగంతో వాహనాలు దూసుకుపోవడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో క

Webdunia
గురువారం, 19 జులై 2018 (16:23 IST)
హైదరాబాదులో వాహనాల రద్దీ కారణంగా రోడ్డు దాటాలంటేనే పాదచారులు హడలిపోతున్నారు. మెరుపు వేగంతో వాహనాలు దూసుకుపోవడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో కొంత మంది ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది గాయాలపాలవుతున్నారు. అయితే ట్యాంక్‌బండ్‌పై ఓ బైకిస్ట్‌ ఓ వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
 
ఈ నెల 14వ తేదీన ట్యాంక్‌బండ్ సమీపంలోని జీబ్రా క్రాసింగ్‌ దగ్గర రోడ్డు క్రాస్ చేయాలనే కంగారులో సిగ్నల్ కూడా సరిగ్గా చూసుకోకుండా.. కాస్త గ్యాప్ దొరకడంతో రోడ్డు దాటేందుకు ఓ వృద్ధుడు పరుగులు తీశాడు. బస్సును దాటి కాస్త ముందుకు రాగానే వేగంగా వచ్చిన బైక్‌ ఆ పెద్దాయనను ఢీకోవడంతో ఎగిరి బైక్‌పైనే పడ్డాడు. 
 
స్పీడ్‌గా వెళ్తున్న బైకిస్ట్‌ బండిని బ్యాలెన్స్‌ చేసే క్రమంలో దాదాపు 300 మీటర్లు వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ విజువల్స్‌ అక్కడి సీసీ కెమెరాలకు చిక్కాయి. ఈ ప్రమాదంలో వృద్ధుడైన వెంకటేశ్వరరావు స్పల్పగాయాలతో బయటపడ్డాడు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments