Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు మృతిపై తానా సంతాపం.. ప్రకటన విడుదల!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (11:40 IST)
ప్రముఖ చిత్రకారుడు, టాలీవుడ్ దర్శకుడు బాపు మృతిపై తానా సంతాపం ప్రకటించింది. ఈ మేరకు తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తానా తొలిరోజుల నుంచి, బాపుకు తానాతో ప్రగాఢ అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. 1985లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన తానా మహాసభలలో ముఖ్య అతిథిగా తానా ఆయనను గౌరవించిందని తెలిపారు. 
 
బాపు బొమ్మ, రమణ రచనల మొదటి ప్రచురణల స్వర్ణోత్సవాన్ని 1995లో దశమ తానా మహాసభలలో (చికాగో) తానా ఘనంగా నిర్వహించటం తెలుగుదేశంలో అందరికీ స్ఫూర్తి కలిగించిందని, ఆ స్వర్ణోత్సవాల్లో భాగంగా బాపు-రమణలపై తానా ప్రత్యేకంగా ప్రచురించిన, బొమ్మా-బొరుసు అనే పుస్తకం బహుళ ప్రచారం పొందిందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా బాపు నిర్యాణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, కానీ తెలుగువారి మనసుల్లో, తెలుగు సాంస్కృతిక ప్రపంచంలో ఆయన స్థానం శాశ్వతమైనది. బాపు కుటుంబసభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అభిమానులకు తానా తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments