Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్తరఫ్‌కు గురైన రాజయ్యకు గాలం వేస్తున్న బీజేపీ - కాంగ్రెస్!!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (11:10 IST)
తెలంగాణ మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో బర్తరఫ్‌కు గురైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి తాటికొండ రాజయ్యకు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు గాలం వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు ఈ రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 
 
మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన రాజయ్యను చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమవంతు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగానే మంత్రివర్గం నుంచి రాజయ్యను తొలగించిన వెంటనే సీఎం వైఖరి పట్ల తీవ్రస్థాయిలో ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు పెద్దపీట వేస్తామన్న సీఎం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. 
 
అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న రాజయ్య పార్టీని వీడాలని సన్నిహితులతో పాటు ఆయన సామాజికవర్గానికి చెందిన నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఇతర పార్టీల పరిస్థితి ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదనే అభిప్రాయంతో ఉన్న ఆయన కొంతకాలం పాటు వేచి చూడవచ్చని తెలుస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments