Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్దిపేటలో స్వైన్ ఫ్లూ : ఒకరు మృతి..!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (08:44 IST)
ప్రపంచాన్నే గడగడలాడించిన ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ ఇప్పుడు మెదక్ జిల్లా సిద్దిపేటలో ఒక ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సిద్దిపేట ఖాదర్‌పురాకు చెందిన దొంత దేవరాజ్ (45) దస్తావేజు రైటర్‌గా పనిచేస్తున్నాడు. పది రోజులనుండి దేవరాజ్ తీవ్ర జలుబు, దగ్గు వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స పొందినా తగ్గకపోవటంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. 
 
వైద్య పరీక్షలు చేసిన వైద్యులు స్వైన్ ఫ్లూ వ్యాధిగా నిర్థారించారు. నాలుగురోజుల చికిత్స అనంతరం డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దేవరాజ్ మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య శారద, ముగ్గురు కుమారులు వున్నారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments