రిషికేష్ నుంచి 20న విశాఖ చేర‌నున్న శారదా పీఠాధిపతి

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (18:03 IST)
విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఈనెల  20వ తేదీన విశాఖ నగరానికి చేరుకోనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత విశాఖ నగరానికి తిరిగి వస్తున్న పీఠాధిపతులకు  భక్తులు స్వాగతం పలుకుతారు. వ‌చ్చే సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు పీఠాధిపతులు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
 
స్వరూపానందేంద్ర స్వామి చాతుర్మాస్య దీక్ష కోసం మే 15వ తేదీన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, వేద విద్యార్థులతో కలిసి విశాఖ నుంచి రిషికేష్ వెళ్ళారు. జూలై 24వ తేదీన  ప్రారంభమైన చాతుర్మాస్య దీక్ష ఈనెల 20వ తేదీన ముగుస్తుంది. దీక్షా సమయాన్ని తపోకాలంగా పరిగణించి వేదాంత చింతనతో గడిపారు. రిషికేష్ తో పాటు హరిద్వార్ తదితర హిమాలయ పాద ప్రాంతాల్లో సంచరించారు. నిత్యం భగవద్గీత పారాయణ చేస్తూ జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన ప్రస్థాన త్రయ భాష్య పాఠాలను వేద విద్యార్థులకు బోధించారు.
 
విశాఖ శ్రీ శారదాపీఠం ప్రచురించదలచిన ఆధ్యాత్మిక గ్రంధాలపై పరిశోధనలు సాగించారు. 129 రోజుల తర్వాత స్వామీజీ తిరిగి విశాఖకు చేరుకుంటున్నారు. అక్టోబరు 7వ తేదీ నుంచి విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహించే శ్రీ శారదా స్వరూప రాజశ్యామల శరన్నవరాత్రి మహోత్సవాలలో పాల్గొంటారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments