Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Webdunia
గురువారం, 27 మే 2021 (10:56 IST)
సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గురువారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. 
 
ఈ ఘటన మునగాల మండలంలోని మాధవరం శివారులో చోటు చేసుకుంది. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
మృతులు కోదాడ సాలర్జంగ్‌పేటకు చెందిన గాధరి ఫ్రాన్సిస్ (56), ఎల్లమ్మ (53)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సాలర్జంగ్‌పేటలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments