Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు లేని యువతిపై కాటేసిన బాబాయ్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (14:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ దారుణం జరిగంది, తల్లిదండ్రులు లేని ఓ యువతిపై సొంత బాబాయే అత్యాచారానికి పాల్పడ్డాడు. వావి వరసలు మరిచి సొంతవారే లైంగికంగా వేధించడంతో బాధిత యువతి(23) ఆత్మహత్యకు పాల్పడింది. 
 
సొంత బాబాయ్, పెదనాన్న కొడుకు కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో బాధితురాలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నేరేడుచర్ల మండలంలోని ఫత్తేపురం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయిలు చిన్న వయసులోనే ఉండగానే చనిపోయారు. 
 
దీంతో పెద్దమ్మాయిని ఆమె పెదనాన్న చేరదీయగా.. చిన్న కూతురిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. ఆమెను పెంచి పెద్ద చేసి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించారు.
 
ఇదిలావుంటే.. పెద్దమ్మాయి పెదనాన్న కుటుంబంతో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె సొంత బాబాయి భార్యకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె ట్రైనింగ్‌కు వెళ్ళింది. అదేసమయంలో యువతి బాబాయికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో బాబాయిని చూసుకునేందుకు ఆమెను కుటుంబసభ్యులు వెళ్లమన్నారు. 
 
అప్పటి నుంచి ఆ యువతి తన బాబాయికి సేవలు చేస్తూ వస్తోంది. అయితే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. యుక్తవయసుకొచ్చిన యువతిని పెదనాన్న కొడుకు కూడా లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. మూడు రోజులుగా తీవ్ర మనస్థాపంతో భోజనం చేయడం మానేసిన బాధిత యువతి జీవితంపై విరక్తి చెంది తనువు చాలించింది. 
 
తన చెల్లెలిని బంధువులే లైంగికంగా వేధిండంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులను కోల్పోయిన యువతి పట్ల అయినవారే ఇలా ప్రవర్తించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం