Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి పందేలపై స్టే ఎత్తివేయలేం.. కత్తులు స్వాధీనం చేసుకోవచ్చు : సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలను రద్దు చేయాలంటూ తెలంగాణ, ఏపీల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ నేత రఘురామకృష్ణరాజు దాఖలు

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (09:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందేలను రద్దు చేయాలంటూ తెలంగాణ, ఏపీల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ నేత రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 
 
పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ఆది నారాయణ వాదనలు వినిపిస్తూ.. సంక్రాంతి పండుగకు కోడి పందేలు నిర్వహించడం వేల సంవత్సరాలుగా ఉన్న సంస్కృతిగా పేర్కొన్నారు. ఏపీలోని కొన్ని జిల్లాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఇవి జరుగుతుంటాయని, అయితే, వీటిని జూదంగా కాకుండా క్రీడగా పరిగణించాలని తెలిపారు. వీటిని రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇస్తూ మరికొన్ని ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. 
 
అన్ని వాదనలు విన్న ధర్మాసనం... హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, కోడి పుంజుల్ని అదుపులోకి తీసుకోవాలన్న తీర్పులోని 4వ అంశం అమలుపై స్టే ఇస్తున్నట్టు జస్టిస్‌ ఖేహర్‌ తెలిపారు. ఈ కేసును విచారణకు స్వీకరిస్తున్నామని, తదుపరి విచారణను 4 వారాలపాటు వాయిదా వేస్తున్నామని అన్నారు. ప్రతిఏటా పందెం రాయుళ్ల భరతం పట్టే క్రమంలో పందెంకోళ్లను పోలీసులు స్టేషన్‌కు తరిలిస్తున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments