Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే బడ్జెట్ చప్పగా ఉంది.. ఆంధ్రాకు మొండిచేయి: చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:51 IST)
లోక్‌సభలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ 2015 ఏమాత్రం ఆశాజనకంగా లేదనీ, తీవ్ర నిరాశకు గురి చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఏపీకి అన్యాయం జరిగింది, ఇది పూర్తి బడ్జెట్ కాదని చంద్రబాబు వాపోయారు. బడ్జెట్‌లో మళ్లీ మార్పులు చోటు చేసుకోవచ్చని తెలిపారు. 
 
విశాఖకు ప్రత్యేక జోన్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పైన ఆసలు పెట్టుకున్నాయి. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో ఏపీకి ఎప్పుడూ అన్యాయం జరుగుతోందని, కొత్త రైల్వేలైన్లు, ప్రాజెక్టుల అభివృద్ధి కోసం అనేకసార్లు పోరాడినా ఫలితం లేదని చంద్రబాబు వాపోయారు. విభజన హామీలో భాగంగా ఇచ్చిన విశాఖ ప్రత్యేక జోన్‌‌పై ప్రకటన రాలేదన్నారు. అయితే, ఇది పూర్తి బడ్జెట్‌ కాదేమోనని, దీనికి కొనసాగింపుగా అదనపు నిధులు, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. 
 
తమకు న్యాయం కోసం కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. గతంలో రైల్వే మంత్రిని కలిసిప్పుడు జాయింట్‌ వెంచర్‌తో రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు గురించి చర్చించామని, దానికి తాము సమ్మతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ కూడా రాశామన్నారు. బడ్జెట్ పైన టీడీపీ నేతలు, ఏపీ మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, మిత్రపక్షం కావడం వల్లే ఏం మాట్లాడలేకపోతున్నామని పలువురు అంటున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments