Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులను లాకప్‌లో పెట్టిన ఘటనపై సుమోటోగా కేసు

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (12:39 IST)
బాలల హక్కులకు ఎవరు భంగం కలిగించినా శిక్షార్హులవుతారని ఏపీ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ సభ్యుడు జె.రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు. 'కౌన్సెలింగ్‌ పేరిట లాకప్‌లో విద్యార్థులు' అనే పేరుతో ఓ పత్రికలో ప్రచురితమైన వార్తా కథనంపై ఆయన స్పందించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. జరిగిన ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
 
విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడం ప్రాథమికంగా తప్పంటూ సంబంధిత ఉపాధ్యాయులను మందలించారు. దీనిపై కమిటీని నియమించి విచారణ చేయిస్తామని చెప్పారు. డీఈవో, కలెక్టర్‌తోనూ మాట్లాడతానన్నారు. ముగ్గురు బాధితులను విచారణకు పిలవగా వారిలో ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాలేదన్నారు. దీంతో ఒకరినే విచారించామన్నారు.
 
బాలల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయమై ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు జగ్గారావుకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో రాజేంద్రప్రసాద్‌ సమావేశమయ్యారు.
 
మరోవైపు, విద్యార్థులను పోలీస్‌స్టేషన్లో పెట్టించిన ఘటనలో ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు తాఖీదులు జారీచేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడమే కాకుండా పోలీసుస్టేషనులో అప్పగించిన సంగతి విదితమే. ఇలా ఎందుకు చేశారో కారణాలు తెలపాలంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.జగ్గారావు, ఉపాధ్యాయులు విజయ్‌ప్రకాశ్‌, గణపతి, సీహెచ్‌ సుధాకర్‌రెడ్డికి ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి డీఎస్‌ఈవో ఎన్‌వీ రవిసాగర్‌ శనివారం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments