Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపాలోకి తెదేపా వలసలు... జడుసుకుంటున్న జగన్...

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (16:10 IST)
భాజపాలోకి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు చేరిపోయిన సంగతి తెలిసిందే. అదికూడా చంద్రబాబుకి వెన్నుదన్నుగా వున్నవారే ఇలా భాజపాలో చేరడం చర్చనీయాంశంగా మారింది. అయ్యెయ్యో... తెదేపాకి ఇంత అన్యాయం చేస్తారా అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

మరికొందరేమో చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో వున్న ప్రతిపక్ష హోదా కూడా ఊడిపోతుందనీ, తెదేపాకి చెందిన కనీసం 15 మంది ఎమ్మెల్యేలు భాజపాలోకి చేరిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సహజంగా అయితే దీనిపై చంద్రబాబు నాయుడికే ఎక్కువ ఇబ్బంది వుంటుంది. 
 
ఐతే తెదేపా నుంచి భాజపాకి జరుగుతున్న వలసలు చూసి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఒకింత షాక్ తింటున్నారట. ఎందుకంటే తెదేపానైతే తేలిగ్గా ట్యాకిల్ చేయవచ్చు. కానీ తెదేపా ఎమ్మెల్యేలు కాస్తా భాజపా ఎమ్మెల్యేలుగా మారిపోతే పరిస్థితి కాస్త గడ్డుగా వుంటుంది.

ఎందుకంటే... కేంద్రంలో వున్నది భాజపా. నిధులు, హోదా వంటివన్నీ భాజపా ద్వారానే సాధించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఏపీ శాసన సభలో ప్రతిపక్షం అవతారంలో భాజపాయే జగన్ ముందు నిలబడితే ఏమవుతుందనే దానిపై వైసీపీ నాయకుల్లో చర్చ జరుగుతోందట.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments