Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాకేజీకి రాజముద్ర.. ఇక ప్రత్యేక హోదాపై మాట్లాడొద్దు?.. : సుజనా చౌదరి

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి రాజముద్ర పడిందని, అందువల్ల ఇకపై ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన స

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (14:20 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి రాజముద్ర పడిందని, అందువల్ల ఇకపై ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. దీనిపై సుజనా చౌదరి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించినందుకుగాను, ఐదుకోట్ల ఆంధ్రులంతా ప్రధాని నరేంద్ర మోడీకి, మంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు, కేంద్ర కేబినెట్‌కు ధన్యవాదాలు తెలపాలని కోరారు. 
 
ముఖ్యంగా ‘‘రెండేళ్లుగా ఏపీలోని యువత, ప్రజలు ఆదుర్దాకు గురయ్యారు. ఎన్డీయేలో తమ మిత్రపక్షమైన బీజేపీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఏపీకి అన్నివిధాలా అనుకూలమైన, ప్రత్యేక హోదాకుమించిన ప్యాకేజీని ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తే ఐదేళ్లపాటు వచ్చే లాభాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. హోదా ద్వారా ఎన్ని నిధులు వస్తాయో, అవన్నీ ప్యాకేజీ ద్వారా వస్తాయి. రూపాయికి రూపాయి నిధులు వస్తాయి. కాబట్టి ఇక ప్రత్యేక హోదా గురించి ఆలోచించాల్సిన పనిలేదు’’ అని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments