Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిపెద్దలేని బతుకు మాకెందుకని - చిన్నోడులేని జీవితం వద్దనీ... తల్లీబిడ్డలు ఆత్మహత్య.. ఎక్కడ?

ఇంటిపెద్ద లేని బతుకు తమకెందుకని భావించిన తల్లీబిడ్డ బలవన్మరణానికి పాల్పడిన విషాదకర సంఘటన ఒకటి కడప జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవల

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (16:53 IST)
ఇంటిపెద్ద లేని బతుకు తమకెందుకని భావించిన తల్లీబిడ్డ బలవన్మరణానికి పాల్పడిన విషాదకర సంఘటన ఒకటి కడప జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మరణం తర్వాత భార్య గౌరీ, కుమారుడు ఇంద్రారెడ్డి మానసికంగా కృంగిపోయారు. 
 
ఇంటి పెద్ద లేని జీవితం వృధా అని భావించిన తల్లీ కొడుకు పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఇంద్రారెడ్డి... జీవితంలో ఎన్ని సాధించినా నాన్న లేనప్పుడు అవన్నీ వృధా అని సుసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
అలాగే, కర్ణాటకలో కూడా మరో విషాదకర సంఘటన ఒకటి జరిగింది. తన చిన్న కుమారుడి ఆత్మహత్యను జీర్ణించుకోలేని ఓ త‌ల్లి త‌న పెద్ద‌కుమారుడితో పాటు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక, దేవనహళ్లి తాలూకాలోని యలియూరుకు చెందిన సుజాత‌ (35) ఇంట్లో చిన్న గొడ‌వ చెల‌రేగింది. దీంతో ఆమె చిన్న‌ కుమారుడు చంద్రతేజ్‌ (12) విషం తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. 
 
చిన్న కుమారుడి మ‌ర‌ణంతో క‌లత చెందిన సుజాత... పెద్ద కుమారుడిని తీసుకొని రైల్వే ప‌ట్టాల వ‌ద్ద‌కు వెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. త‌న చిన్న కుమారుడి మృతితో మ‌న‌స్తాపం చెందాన‌ని, తమ చావుకు ఎవరూ కారణం కాదని ఆత్మ‌హ‌త్య లేఖ రాసింది. త‌న‌ను, త‌న పెద్ద‌కుమారుడినీ ఒకే గోతిలో ఖ‌న‌నం చేయాల‌ని ఆత్మహత్య లేఖలో కోరింది. 
 
త‌మ‌ను ఖ‌న‌నం చేస్తోన్న గోతిలో విల్సన్‌ బాల్, పౌడర్‌ డబ్బా, చెప్పులు కూడా వేయాలని కోరింది. తాను స్థానికంగా ఉండే సరస్వతమ్మ, ఆనంద్‌ అనే ఇద్దరికి కొంత అప్పు ఉన్నాన‌ని, వారికి ఇవ్వాల్సిన‌ ఆ డబ్బుని ఇంట్లోని టీవీ కింద పెట్టాన‌ని, ఆ డబ్బును వారికి ఇవ్వాలని సూసైడ్ లేఖలో పేర్కొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments