Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు చేసిన సాయం నాతోనే ఆగిపోకూడదు సార్.. పవన్ కళ్యాణ్‌తో స్టంట్ మాస్టర్ బద్రీ

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (08:12 IST)
ఆ నాడు మీరు చేసిన సాయం వల్ల ఇపుడు నేను, నా కుటుుంబం ఎంతో సంతోషంగా ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి అయిన నాలాంటి వారికి అనేక మందికి సాయం చేయాలని సార్ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు స్టంట్ మాస్టర్ శ్రీబద్రీ కోరారు. ఈ మేరకు ఆయన భోళాశంకర్ చిత్రానికి ఇచ్చిన రూ.50 వేల పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన పవన్‌ను కలిసి ఈ చెక్కును అందచేశారు. 
 
తెలుగు, తమిళ  చిత్రాల్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్స్‌ను అలవోకగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న స్టంట్ మాస్టర్ శ్రీబద్రి... చిరంజీవి - మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన భోళా శంకర్ చిత్రంలో ఓ కారును నడుపుతూ ఆయన చేసిన స్టంట్‌కు ప్రశంసలు దక్కాయి. ఇందుకోసం ఆయనకు రూ.50 వేల పారితోషికం ఇవ్వగా, దాన్ని జనసేనకు విరాళంగా ఇచ్చారు.
 
ఈ సందర్భంగా శ్రీబద్రి మాట్లాడుతూ, 'సాటి మనిషికి సాయం చేయాలన్న మనస్తత్వం కలిగిన వ్యక్తి మీరు(పవన్‌ కల్యాణ్‌). 28 సంవత్సరాల కిందట మీరు నాకు సాయం చేశారు. దాని వల్ల నేను స్టంట్‌మ్యాన్‌ అయి, భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నా. నా చిన్న కుమార్తె అమెరికాలో చదువుకుంది. అంతా మీ దయ. మీరు చేసే సాయం నాతో ఆగిపోకూడదు. మీ వల్ల ఎంతో మంది సాయం పొందుతున్నారు. ఇంకా పొందాలి. మీరు సీఎం అయి, నాలాంటి వాళ్లకు సాయం చేయాలి' అని అన్నారు. 
 
అలాగే, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 'తెలుగు చిత్ర పరిశ్రమలో వెహికల్స్‌తో ఎలాంటి డేర్‌ డెవిల్స్‌ స్టంట్స్‌ చేయాలన్నా అది బద్రికే సాధ్యం. నేను నటుడిగా శిక్షణ పొందుతున్న దగ్గరి నుంచి ఆయన నాకు పరిచయం. ‘భోళా శంకర్‌’లో కారుతో ఓ స్టంట్‌ చేసినందుకు అందుకున్న రూ.50 వేల పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఆయనికు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments