Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (06:31 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే చెవిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

తిరుపతి రూరల్ మండలం ఏ.వి.పురం లో ఎంపీపీ పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో మోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గది నిర్మాణానికి రూ.11 లక్షలు వెచ్చించినట్లు వివరించారు.

ఇందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవ తీసుకున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా మహేశ్వరి, కార్యదర్శి మాధవి వేదంతపురం సర్పంచ్ అభ్యర్థి తోట చిరంజీవి రెడ్డి, నాయకులు చంద్ర ముదిరాజ్, రవి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నాగరాజు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గంగిరెడ్డి, మురళి,పార్థ సారధి,నాగభూషణం, మధు, ప్రేమ్, గాంధీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments