Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం నాటికి తుపాను ప్రభావం

Webdunia
గురువారం, 14 మే 2020 (16:47 IST)
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం ఈరోజు ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనముగా మారింది.

దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు  ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రేపు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతములో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి అదే ప్రాంతంలో  మే 16 వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది.

ఇది ప్రారంభంలో మే 17 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, తరువాత మే 18 నుండి 19 వ తేదీలలో ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
 
మరఠ్వాడ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
 
కోస్తా ఆంధ్ర మరియు యానాం:
ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 km)  తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు  దక్షిణ కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఏర‌్పడే అవకాశం ఉంది. రేపు  ఉరుములు,  మెరుపులుతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
 
ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 km)  తో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
రాయలసీమ:
ఈ రోజు, రేపు  రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుండి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఎల్లుండి  రాయలసీమలో ఉరుములు,  మెరుపులు మరియు ఈదురు గాలులు(గంటకు 30 నుండి 40 km)తో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది అని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments