Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టులో సంస్కరణలకు శ్రీకారం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (08:09 IST)
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైకోర్టులో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ఆధునిక సాంకేతికత వినియోగంతో కేసుల విచారణను సాధ్యమైనంత త్వరగా ముగించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ-ఫైలింగ్‌ను ప్రోత్సహించేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి పూనుకున్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రార్‌లకు పలు సూచనలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కక్షిదారులు పిటిషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి తీర్పు కాపీ అందేవరకు ఎక్కడా జాప్యం జరుగకుండా ప్రక్రియ సాఫీగా నడిచేలా చర్యలు తీసుకోవడంపై న్యాయ విభాగం ఉన్నతాధికారులతో సీజే చర్చించినట్లు సమాచారం.
 
అలాగే కేసులు కూడా వరుస క్రమాన్ని బట్టి, ప్రాధాన్యతను బట్టి ఆటోమేటిగ్గా లిస్టయ్యేలా సాఫ్ట్‌వేర్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై దృష్టి సారించారు. 
 
సోమవారం ఉద్యోగులతో భేటీ: హైకోర్టులో పలు ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. తగినంతమంది ఉద్యోగులు లేకపోవడంతో ఇప్పటికే వున్న సిబ్బందిపై తీవ్ర పని ఒత్తిడి వున్నట్లు ఉన్నతాధికారులు సీజే దృష్టికి తీసుకెళ్లారు. దానిపై ప్రత్యేక దృష్టి సారించిన సీజే... సోమవారం హైకోర్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నట్లు తెలిసింది.

కోర్టులో ఖాళీగా వున్న పోస్టుల్ని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే సీజే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments