Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌ల్యాణ‌మ‌స్తు, శ్రీ‌నివాస క‌ల్యాణాల్లో శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందించాలి :టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:35 IST)
టిటిడి త్వ‌ర‌లో నిర్వ‌హించనున్న క‌ల్యాణ‌మ‌స్తు, శ్రీ‌నివాస క‌ల్యాణాలు లాంటి ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఆయా ప్రాంతాల్లోని శ్రీ‌వారి సేవ‌కులు త‌మవంతు స‌హ‌కారం అందించి సేవ‌లందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు.

తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి సేవా స‌ద‌న్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న శ్రీ‌వారి సేవ‌కుల‌తో మాట్లాడారు. ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం నాడు విశేషంగా సేవ‌లందించార‌ని అభినందించారు. అద‌న‌పు ఈవో మాట్లాడుతూ టిటిడి మ‌హాయ‌జ్ఞంలా త‌ల‌పెట్టిన అనేక హైంద‌వ ధార్మిక కార్య‌క్ర‌మాల్లో శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌న్న సంక‌ల్పంతో ఉంద‌న్నారు.

ఇటీవ‌ల క‌ర్నూలులో ధ‌నుర్మాస ల‌క్ష్మీ దీపారాధ‌న‌, వైజాగ్‌లో కార్తీక స‌హ‌స్ర దీపోత్స‌వం, నెల్లూరులో వ‌సంత పంచ‌మి స‌ర‌స్వ‌తి పూజ, తిరుమ‌ల‌లో జ‌రిగిన ర‌థ‌స‌ప్త‌మి కార్య‌క్ర‌మాల్లో శ్రీ‌వారి సేవ‌కులు విశేషంగా సేవలందించార‌ని కొనియాడారు.

స్వామివారికి భ‌క్తులంటే ఎన‌లేని ప్రేమ అని, పురాణాల్లోని ప్ర‌హ్లాద‌చ‌రిత్ర‌, గ‌జేంద్ర‌మోక్షం ఘ‌ట్టాలు దీన్ని నిరూపిస్తున్నాయ‌ని చెప్పారు.

ప‌విత్ర‌మైన తిరుమ‌ల‌లో వారం రోజుల పాటు బ‌స చేసి స్వామివారికి ప్రియ‌మైన భ‌క్తుల‌కు సేవ‌లందించ‌డం శ్రీ‌వారి సేవ‌కుల పూర్వ‌జ‌న్మ పుణ్య‌ఫ‌లమ‌న్నారు. సేవ‌కులు త‌మ ప్రాంతాలకు వెళ్లి ఇక్క‌డి అనుభ‌వాలు, వ‌స‌తుల‌ను తెలియ‌జేసి మ‌రింత మంది శ్రీ‌వారి సేవ‌కు వ‌చ్చేలా కృషి చేయాల‌ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments