Webdunia - Bharat's app for daily news and videos

Install App

సివిల్స్‌ శిక్షకుడే హంతకుడు.. శ్రీమిత్ర హత్య కేసులో వీడిన మిస్టరీ

శ్రీమిత్ర హత్య కేసులోని మిస్టరీ వీడింది. సివిల్స్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ ఇచ్చే వ్యక్తే హంతకుడిగా గుర్తించారు. ఓ కోచింగ్‌ సెంటర్లో రెండు సీట్లు ఇప్పిస్తానని రూ.50 వేలు తీసుకున్నాడు.

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (08:19 IST)
శ్రీమిత్ర హత్య కేసులోని మిస్టరీ వీడింది. సివిల్స్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ ఇచ్చే వ్యక్తే హంతకుడిగా గుర్తించారు. ఓ కోచింగ్‌ సెంటర్లో రెండు సీట్లు ఇప్పిస్తానని రూ.50 వేలు తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా.. సీట్లు ఇప్పించకపోవడాన్ని ప్రశ్నించడంతో శ్రీమిత్రను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 9వ తేదీన జరిగిన కృష్ణానగర్‌కు చెందిన శ్రీమిత్ర హత్యకు గురైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శ్రీమిత్ర తన అక్క కూతుళ్లకు ఏస్‌ అకాడమీలో ట్రాన్స్‌కో, జెన్‌కో పోస్టుల పరీక్షకు కోచింగ్‌ ఇప్పించడానికి స్నేహితుడైన పవన్‌ను సంప్రదించాడు. శిక్షణ కోసం డబ్బు తగ్గించాలని అతడిని కోరాడు. పవన్ ట్వంటీ ఫస్ట్‌ సెంచరీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటున్న సందీప్‌రెడ్డిని పరిచయం చేశాడు. శ్రీమిత్ర కోచింగ్‌ కోసం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు సందీప్‌రెడ్డికి అందజేశాడు. 
 
రాకేష్‌ తన స్నేహితుడు వెంకటేశ్‌కు అదే ఏస్‌ అకాడమీలో గేట్‌ కోచింగ్‌ కోసం రూ.40 వేలు సందీప్‌ రెడ్డికి ఇచ్చాడు. సీట్లు ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వమని సందీప్‌రెడ్డిపై శ్రీమిత్ర ఒత్తిడి తెచ్చింది.  వీరిమధ్య వివాదం జరిగింది. సందీప్‌రెడ్డి తన వద్ద ఉన్న కత్తితో శ్రీమిత్ర మెడ కుడివైపు పొడిచాడు. 
 
తీవ్ర రక్తస్రావం జరగడంతో సందీప్‌రెడ్డి సమీపంలో ఉన్న మెడికల్‌ హాల్‌కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశాడు. పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. మార్గమధ్యంలో శ్రీమిత్ర మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితుడు సందీప్‌రెడ్డిని నల్లగొండ బస్టాండ్‌లో సోమవారం అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments