Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో అర్థరాత్రి కలకలం... గది కోసం దేవస్థానం ఉద్యోగి తలపై గన్‌ ఎక్కుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తి!

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (12:46 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అర్థరాత్రి కలంకలం రేగింది. ఆలయంలోని సీఆర్ ఓ కార్యాలయం (గదులు ఇచ్చే స్థలం)లో పనిచేసే ఒక దేవస్థానం ఉద్యోగి తలపై గుర్తుతెలియని వ్యక్తి గన్‌ పెట్టాడు. అది కూడా ఎందుకంటే.. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఉన్న గదులను అద్దెకు ఇవ్వాలని. ఇలాంటి సంఘటనతో ఒక్కసారిగా కాళహస్తి ఉలిక్కిపడింది. 
 
శుక్రవారం ఉదయం 1.40 నిమిషాల ప్రాంతంలో ఒక వ్యక్తి సిఆర్‌ఓలో పనిచేస్తున్న దేవస్థానం ఉద్యోగి వద్దకు వచ్చాడు. గది కావాలని తమిళంలో మాట్లాడాడు. గదులు నిండిపోయాయి. ఖాళీగా లేవు, వెయిట్‌ చేయాలని దేవస్థాన సిబ్బంది చెప్పాడు. నాకు గది కావాలంతేనని పట్టుబట్టాడు గుర్తుతెలియని వ్యక్తి. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. 
 
వెంటనే ఆ గుర్తుతెలియని వ్యక్తి తన జేబులో నుంచి గన్‌ తీసి దేవస్థానం తలపై ఎక్కుపెట్టాడు. వూహించని పరిణామంతో ఉద్యోగి అలాగే కూర్చుండిపోయాడు. ఎవరూ అక్కడ లేకపోవడంతో శ్రీకాళహస్తి దేవస్థానం ఉద్యోగి ఏమీ చేయలేని పరిస్థితి. కొద్దిసేపటికి అటువైపుగా ఎవరూ వస్తున్న చప్పుడు రావడంతో గుర్తుతెలియని వ్యక్తి అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు.
 
దీంతో తేరుకున్న ఉద్యోగి నేరుగా ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి జరిగింది చెప్పుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని ఉన్నతాధికారులు ఆ ఉద్యోగికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్త అందరికీ తెలిసి పోయింది. ఆలయంలో తుపాకీతో వ్యక్తి రావడంపై ప్రస్తుతం భయాందోళన నెలకొంది. ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఉన్నతాధికారులు కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేయమన్నారు. అయితే ఇది చర్చకు దారితీయడంతో ఫిర్యాదు చేయాలని ఉద్యోగికి స్థానిక పోలీస్టేషన్‌కు పంపారు. శ్రీకాళహస్తి పోలీస్టేషన్‌లో ఇదే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments