Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు... ఏపీలో కేఈ కృష్ణమూర్తి, టీలో కేసీఆర్..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (09:18 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా  రామాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ప్రభుత్వం అధికారిక వేడుకలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరవుతున్నారు. 
 
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవంలో టీఎస్ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఛైత్రశుధ్ద నవమి అభిజిత్ లగ్నమందు శ్రీరామకల్యాణం నిర్వహించనున్నారు. 
 
ఇదేవిధంగా ఉత్తరాంధ్రలోని రామతీర్థంలో కూడా ఆంధ్రా ప్రభుత్వం అధికారికంగా వేడుక నిర్వహించనుంది. ఒంటిమిట్టలో శ్రీరామునికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, రామతీర్థంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 
 
ఇక భద్రాచలంలో రామయ్యకు కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, ఏప్రిల్ 2న జరిగే కల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు పాల్గోనున్నారు. దేశంలోని ప్రధాన దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీరామకల్యాణాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు దేవాలయాలకు చేరుకుంటున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments