గవర్నర్ 'ఎట్ హోం' డిన్నర్ వంటకాలు ఇవే... పుష్టిగా ఆరగించిన అతిథులు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం విందు ఇచ్చారు. ఈ విందులో వండి వడ్డించడానికి ప్రత్యేక చెఫ్‌లను ఏర్పాటు చేయగా, వారు నోరూ
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం విందు ఇచ్చారు. ఈ విందులో వండి వడ్డించడానికి ప్రత్యేక చెఫ్‌లను ఏర్పాటు చేయగా, వారు నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. గవర్నర్ స్వయంగా ఎంపిక చేసిన వంటకాలను తయారు చేసి.. అతిథులకు వడ్డించారు. వీటిని రుచిచూసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ సహా పలువురు వీఐపీలు, వంటకాలు బాగున్నాయని కితాబిచ్చినట్టు సమాచారం.