Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీ కొడుకుల మధ్య మనస్పర్ధలు.. వారం రోజులుగా ఆహారం లేదు..

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (17:14 IST)
మనస్పర్ధల కారణంగా 25 ఏళ్ల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు కూమారులు కూడా దూరం పెట్టడంతో ఏ గతీ లేక చెట్ల పుట్ల వెంట తిరిగుతోంది ఓ మహిళ. వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ గ్రామంలో చోటుచేసుకుంది. శివపార్వతికి స్థానిక శ్రీనివాస కాలనీకి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. 
 
ఆ తర్వాత కుటుంబంలో తలెత్తిన కలహాల కారణంగా 25 ఏళ్ల క్రితం భర్త నుండి విడాకులు తీసుకుని ఇద్దరు కుమారులతో పుట్టింటికి చేరుకుంది. కొడుకులకు ఇంకా వివాహం కాలేదు. అయితే ఈ మధ్య తల్లీ కొడుకుల మధ్య కూడా వివాదాలు వచ్చాయి. అప్పటి నుండి కుటుంబీకులు ఆమెను సరిగ్గా చూసుకోలేదు. దాంతో ఆవేదనకు గురైన వృద్ధురాలు ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయింది. 
 
గ్రామ శివారులోని పొలంలో ఉన్న తమ పాత ఇంటి శిథిలాల వద్ద తలదాచుకుంది. వారం రోజులుగా ఆహారం సరిగ్గా లేకపోవడంతో శరీరం నీరసించింది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు శివపార్వతి కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లీ కొడుకులను ఇంటికి పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కి.. భక్తిని చాటుకున్న నందినిరాయ్ (video)

మొండి గుర్రాన్ని సైతం బాలకృష్ణ కంట్రోల్ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు : బాబీ కొల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments