Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీకి బీజేపీలో ఎలాంటి బాధ్యతలూ లేవు, సంబంధం లేదు: సోము వీర్రాజు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (13:26 IST)
కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేయరాదంటూ ప్రకటనలు చేస్తున్న సినీ హీరో శివాజీకి బీజేపీలో ఎలాంటి బాధ్యతలూ లేవని, ఆయనకూ, ఆయన చేసే వ్యాఖ్యలకూ తమ పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు మాత్రమే విడుదల చేయగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మాత్రం రూ.6 వేల కోట్లు ఇచ్చిందని వీర్రాజు చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉన్నదని, ఈ బాధ్యతను తాము భుజాలపై మోస్తామని సోము తెలిపారు. మంగళవారం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నిధులు విడుదల చేయటం లేదంటూ తెలుగుదేశం పార్టీ నిందిస్తోందని, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల్ని కూడా విమర్శించేలాగా జరుగుతున్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. 
 
ఏపీకి అన్యాయం ఏమీ జరగటం లేదని, అలా తాము జరగనివ్వబోమని చెప్పారు. తాము ఒకపక్క బాధ్యతాయుతంగా ముందుకెళుతున్నా టీడీపీ మాత్రం కేంద్రంపై విమర్శలు చేయటం తగదన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments