Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి బాలినేని వ‌ద్ద‌కు గుప్తా... సుభానీ ఓవ‌ర్ యాక్ష‌న్ వ‌ల్లే అంతా!

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (13:03 IST)
ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అనుకున్న‌ట్లే ప్లేట్ ఫిరాయించాడు. త‌నపై మంత్రి బాలినేని శ్రీనివాస్ దాడి చేయించ‌డం ఏమిట‌ని ఎదురు ప్ర‌శ్నించాడు. ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్రమానికి సుబ్బారావు గుప్తా హాజ‌ర‌య్యాడు. ఇది మంత్రి బాలినేని ఏర్పాటు చేయ‌డం ఇక్క‌డ విశేషం. 
 
 
విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి దగ్గర ప్రత్యక్షమైన సోమిశెట్టి సుబ్బారావు గుప్తా త‌న‌పై ఎటువంటి దాడి జ‌రగ‌లేద‌నే రీతిలోనే వ్య‌వ‌హ‌రించాడు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలలో మంత్రితోపాటు కేక్ కట్ చేసి సుబ్బారావు గుప్తా, సీఎంకు శుభాకాంక్షలు తెలిపాడు. మంత్రి బాలినేని తనపై దాడి చేయించార‌నే వార్తలను సుబ్బారావు గుప్తా ఖండించాడు.  
 
 
సుభాని అనే వ్యక్తి ఓవరాక్షన్ ఇంత రచ్చకు కారణం అని గుప్తా చెప్పాడు. తాను మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని వెంట వున్నాన‌ని, తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశాన‌ని చెప్పాడు. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరూ లేర‌ని, పార్టీని బతికించుకోవాల‌నే  ఆకాంక్షతో తాను ఇది చేశాన‌ని, ఇందులో ఎటువంటి దురుద్దేశ్యం లేద‌న్నాడు. 
 
 
మరో 29ఏళ్లపాటు సీఎం జగన్ సీఎం గా ఉండాల‌ని, త‌నపై దాడి విషయాన్ని పెద్ద ఇస్యూ  చేయకుండా ఉండాలని మనవి చేసుకుంటున్నాన‌ని గుప్తా చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

ఇది నాకు స్పెషల్ మూమెంట్ : మట్కా హీరోయిన్ మీనాక్షి చౌదరి

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments