కొండెపిలో స్నేక్ మ్యాన్

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:35 IST)
పామంటే ప్రతిఒక్కరికి భయమే.. దాన్ని చూసినా.. విన్నా ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటిది పాము కనిపిస్తే చాలు పండగ చేసుకుంటున్నాడో వ్యక్తి.

దాని విషాన్ని పాయసంలా.. శరీరాన్ని పకోడీలా నమిలిపారేస్తున్నాడు ఈ వ్యక్తి. ఇతని పేరు వెంకటేశ్వర్లు. ప్రకాశం జిల్లా కొండెపి మండలం నేతివారిపాలెం ఇతని స్వగ్రామం. చిన్నప్పటినుంచి పాములు పట్టడమే ఇతని వృత్తి.. అయితే.. అదే అలవాటుగా కనిపించిన పామునల్లా కొరికి ముక్కలు చేస్తుంటాడు.

చుట్టుపక్కల గ్రామాల ఇళ్లలోకి పాము దూరితే ఇతన్నే సంప్రదిస్తుంటారు. ఎంతటి విషసర్పాన్ని అయినా ఇట్టే పట్టేసి మేడలో వేసుకొని ఆటలాడుతుంటాడు. అంతటితో ఆగకుండా ఆ పామును తలలోని విషాన్ని కక్కించి తాగుతాడు, తన నాలుకను పాము తలలో పెడతాడు.

ఇంత చేసినా ఇప్పటివరకు అతని ప్రాణానికి ఎటువంటి ముప్పు ఏర్పడలేదు. చిన్నతనం నుంచే పాముల విషాన్ని సేవించడం వలన అతని శరీరమంతా విషమయమైంది. దాంతో అతను ఏ జంతువును కరిచినా అది అరగంటలో చనిపోతుంది.

కానీ అతని ఒంట్లో విషం ఉందని తెలిసినా గ్రామస్థులు అతనితో స్నేహం చేస్తుంటారు. దానికి కారణం అతను ఎవరిని ఏమి అనకపోవడమే. పైగా గ్రామస్తులంతా అతన్ని ముద్దుగా పున్నమినాగు అని పిలుచుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajasab loss: తెలంగాణాలో రాజా సాబ్ ప్రివ్యూలను అడ్డుకున్నదెవరు? నష్టపోయిన నిర్మాత

Niharika Konidela: నిహారిక కొణిదెల‌ నిర్మిస్తోన్న‌ చిత్రం రాకాస

Raja Saab review : ద రాజాసాబ్ తో ప్రభాస్ అలరించాడా! లేదా! - ద రాజాసాబ్ రివ్యూ రిపోర్ట్

Oscars 2025: ఎలిజిబుల్ ఫిల్మ్స్ బెస్ట్ పిక్చర్స్ రేసులో కాంతార చాప్టర్ 1

Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

తర్వాతి కథనం
Show comments