Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుతో బుద్ధి చెప్పండన్న పవన్ కళ్యాణ్... పవన్ ఆగ్రహం వెనుక...

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (17:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ విజయానికి అందరు కృషి చేయాలని పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రత అనేది ఓ ఒక్కరి వల్లో సాధ్యపడదంటూ చెప్పిన పవన్ ఆడపిల్లకు భద్రత ఉండే సమాజం కావాలని ఆకాంక్షించారు. కుర్రాళ్లు తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. తప్పును తప్పు అని నిలదీసినప్పుడే సమాజం ఆరోగ్యవంతమౌతుందని అన్నారు. 
 
రోడ్డు మీద ఓ అమ్మాయిని ఏడిపిస్తుంటే 150 మంది చుట్టూ ఉన్నా మనకెందుకులే అని వదిలేస్తుంటారనీ, కానీ వారిలో ఒక్కరు స్పందించినా మిగిలినవారు తోడు వస్తారన్నారు. అలాంటి తెగువ కుర్రాళ్లలో కావాలని ఆకాంక్షించారు.
 
విద్యార్థులతో ముఖాముఖి ప్రసంగించిన పవన్ కళ్యాణ్... రాష్ట్ర విభజనపై కూడా మాట్లాడారు. ఒకే ఒక్క జనరేషన్ చేసిన తప్పిదం వల్ల రాష్ట్రం రెండు ముక్కలైందని అన్నారు. కాగా పవన్ కళ్యాణ్ మంగళవారం జీఎంఆర్‌ ఆస్పత్రి, జీఎంఆర్‌ సంస్థల ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న బిజినెస్‌ మీట్‌లో సమావేశంలో పవన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, మిగితా సంస్థల సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఉదయం 10 గంటలకు రాజాం చేరుకున్న ఆయన జీఎంఆర్‌ కేర్‌ ఆస్పత్రి, సంస్థలను సందర్శించారు. 
 
ఆ తర్వాత ఆయన స్థానిక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పవన్ 'స్వచ్ఛ భారత్'పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ మెగా హీరోను ప్రధాని నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.  కాగా, పవన్ కల్యాణ్ రాకతో రాజాంలో సందడి నెలకొంది. తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments