Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోల మృతి?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (16:04 IST)
గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు కాల్పులు చోటుచేసుకున్నాయి. విశాఖ మన్యంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట వ‌ద్ద బుధవారం ఈ ఎదురు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మాచారంతో మంప పోలీస్‌స్టేసన్ ప‌రిధిలో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
 
అయితే ఎదురు కాల్పుల్లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారన్న దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. సంఘటనా స్థలం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియడానికి కాస్త సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. 
 
ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. ఘ‌ట‌నాస్థలిలో ఏకే- 47 తుపాకులు లభ్యమయ్యాయి. ఈ ఘటన తర్వాత మావోయిస్టు అగ్రనేత‌లు త‌ప్పించుకున్నార‌న్న స‌మాచారంతో భద్రతా దళాలు హెలికాప్టర్ సాయంతో గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments