Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తుంటే శివాజీగాడు ఎవడు? వాడిది ఏ కులం? అని ప్రశ్నిస్తున్నారట

హోదాపై పోరాడుతున్న ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ.. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతుంటే శివాజీగాడు ఎవ‌డు? వాడిది ఏ కులం? అని కొందరు ప్ర‌శ్నిస్తున్నార‌ని ఆవేద

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (13:40 IST)
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లాభం లేదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ చెప్తున్న కేంద్రంపై ఇప్పటికే ప్రజలు గుర్రుగా ఉన్నారు. హోదా కోసం మభ్యపెడుతూ.. అన్నీ అబద్ధాలు చెప్తూ.. హోదా వస్తే పరిశ్రమలు రావని, ఇంకా హోదా అడిగితే ఇతర రాష్ట్రాలకు లింకు పెట్టడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హోదాపై పోరాడుతున్న ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ.. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతుంటే శివాజీగాడు ఎవ‌డు? వాడిది ఏ కులం? అని కొందరు ప్ర‌శ్నిస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రత్యేక హోదా విషయంలో ఇంకెన్ని రోజులు ప్రజలను మభ్యపెడతారని అడిగారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ప్రత్యేక హోదాని వదులుకుంటారా? అంటూ శివాజీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన బెట్టి కులాన్ని పట్టుకుని ఊగులాడటం ఏమిటని.. తానే కులమో ఇప్పుడు అవసరమా అంటూ అడిగారు. జనసేన అధినేత పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వారు హోదాపై అడిగిన‌ప్పుడు ఎందుకు వీరు అస‌హ‌నానికి గుర‌వుతున్నార‌ని మండిపడ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వారు హోదా కోసం పోరాడాల్సిన అవసరం వుందని శివాజీ అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments