Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిత్రాంగ్ తుఫాను.. ఏపీ, తెలంగాణకు ముప్పు పొంచి వుందా?

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (13:07 IST)
సిత్రాంగ్ తుఫాను ప్రభావం కారణంగా ఒడిశాలో భారీ భారీ ర్షాలు కురిసే అవకాశం ఉందని, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ వైపు ఈ వర్షాలు దూసుకువెళ్లే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. దీంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 
 
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఉత్తర అండమాన్‌ సముద్రం, సంబంధిత ప్రాంతాలపై పరుచుకున్న అల్పపీడనం, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.  
 
అయితే సిత్రాంగ్ తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పులేదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 
 
ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారిందని వెల్లడించింది. వాయుగుండం తుపానుగా మారడంతో మరో మూడు రోజుల వరకు ఏపీలో పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. త్వరలోనే ఈశాన్య రుతుపవనాలు ఏపీలో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments