Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనా సెల్ నుంచి ఆరు మెస్సేజ్‌లు.. చనిపోయిందనుకున్న తరువాత.. ఎవరికి?.. ఎలా..?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:09 IST)
క్రైమ్ సీరియల్ ను తలపిస్తోన్న షీనా కేసులో తాజాగా మరో విషయం బయటపడింది. ఆమె సెల్ ఫోన్ నుంచి ఆరు మెస్సేజ్‌లు తన బోయ్ ఫ్రెండ్‌కు వెళ్ళాయి. 2012, ఏప్రిల్ నెలలో షీనా హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నా.. ఆ తరువాత ఆమె సొంత మొబైల్ ఫోన్ నుంచి తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ ముఖర్జీయాకు ఆరు మెస్సేజ్ లు వచ్చాయట. ఇది పోలీసుల బుర్రలను తొలచి వేస్తోంది. 
 
పోలీసు విచారణలో రాహుల్ స్పష్టం చేశాడు. షీనా అదృశ్యమైన నాటి నుంచి తనకు వరుసగా కొన్ని మెస్సేజ్ లు వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న పోలీసులు.. అసలు ఆ మెస్సేజ్ లు పంపిందెవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నేను యూఎస్ కు వెళ్లిపోయాను.. దయచేసి నన్ను ఫాలో కావద్దు. ఇక నీతో ఎటువంటి సంబంధం కొనసాగించదలుచుకోలేదు.. 
 
నాకు ఫోన్ చేయకు. మెస్సేజ్ లు కూడా పంపకు. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా.. నీతో మాట్లాడం నాకు ఇష్టం లేదు. నేను అమెరికాలో ఉన్నా. నాకు యూఎస్ లో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి...  నేను అతనితో సంతోషంగా ఉన్నా అని షీనా తన మొబైల్‌కు మెస్సేజ్‌లు పంపినట్లు రాహుల్ తెలిపాడు. అయితే ఆమె నేరుగా పంపారా లేక ఆమె సెల్ నుంచి ఎవరైనా పంపారా అనే అనుమానాలు వ్యక్తమతున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments