షర్మిల, ప్రభాస్‌లపై వీడియోలను అందుకే పోస్టు చేశాం...

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (09:05 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, సినీ హీరో ప్రభాస్‌లపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. ఇలా నెట్టింట తప్పుడు వార్తలను ప్రచురించి... షర్మిలను ట్రోల్ చేసేలా చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


ప్రభాస్, షర్మిలకు లింక్ పెట్టి వార్తలు, వీడియోలు పోస్టు చేస్తే.. ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దామని అలా చేశామని నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. వీరిద్దరినీ కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. షర్మిలను రాజకీయంగా దెబ్బతీయాలని, ఆమెతో కక్ష్యతో ఈ పని చేయలేదని నిందితులు తెలిపారు. 
 
ఇంకా కొన్ని నెలల క్రితం తాను ఆరు వీడియోలను పోస్ట్‌ చేసినట్టు నిందితుల్లో ఒకరు వెంకటేష్‌ అంగీకరించగా, తాను రెండురోజుల వ్యవధిలో నాలుగు వీడియోలు మాత్రమే అప్‌ లోడ్‌ చేశానని నవీన్‌ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో వీరు అప్‌ లోడ్‌ చేసిన ఫొటోలు, వీడియోల్లో ఉన్న కంటెంట్ ఎక్కడిదన్న విషయమై పోలీసులు కూపీ లాగుతున్నారు.
 
ఇప్పటికే ఈ కేసులో కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులకు నోటీసులు జారీ అయ్యారు. రెండు చానెళ్లలో షర్మిల వ్యక్తిగత జీవితంపై 100కు పైగా వీడియోలను పోస్ట్ చేశారని గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, వారిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments