Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ దీక్ష జరిగితే.. మోడీ రాకకు ప్రమాదమని భగ్నం చేశారు: షర్మిల

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (11:00 IST)
వైఎస్సార్సీపీ అధినేత జగన్ దీక్ష ఇలాగే జరిగితే, శంకుస్థాపన రోజు రాష్ట్ర ప్రజలు మోడీ అడ్డుకునే ప్రమాదం ఉందని.. సీఎం చంద్రబాబు భయపడ్డారని జగన్ సోదరి షర్మిల అన్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని షర్మిల చెప్పారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి ఆమె మాట్లాడుతూ, జగనన్న నీరసించిపోయాడని అన్నారు. కీటోన్స్ అదుపులోకి రావాలని వైద్యులు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. 
 
షుగర్ లెవెల్స్ పడిపోయాయని, వాటిని అదుపులోకి తెచ్చేందుకు వైద్యులు కృషి చేస్తున్నారని షర్మిల అన్నారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారని, నేడు మొత్తం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామన్నారని, రేపు సెమీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని తెలిపారని షర్మిల చెప్పుకొచ్చారు. తర్వాత ఘనాహారం ఇవ్వడం కుదురుతుందన్నారు. 
 
జగనన్న ఇలాగే దీక్ష చేస్తే రాజధాని నిర్మాణ ఏర్పాట్లను ప్రజలు అడ్డుకునే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందిందని, అందుకే ఆయన దీక్షను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసిందని షర్మిల వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments