Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి కాంగ్రెస్ వాదే: శైలజానాధ్

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (07:17 IST)
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏఐసీసీ, ఏపీసీసీ స్పష్టం చేసింది. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదని సోమవారం ఉమెన్ చాందీ అనడంపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదేనని స్పష్టం చేశారు. చిరంజీవి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఏపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ చెప్పారన్నారు.

కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు, పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని శైలజానాధ్ పేర్కొన్నారు.

చిరంజీవి, ఆయన కుటుంబం మొదట నుంచి కాంగ్రెస్ వాదులని తెలిపారు. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అని వార్తలు రాయడం దారుణమన్నారు.

భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయని..ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందని ప్రెస్ నోట్‌లో సాకే శైలజానాధ్ స్పష్టం చేశారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments